మేదరిపేట విద్యుత్ షాక్ ప్రమాదం.. సీసీటీవీ ఫుటేజ్ లీక్

కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల(Mancherial) జిల్లా దండేపల్లి మండలం మేదరిపేట(Medaripet)లో ఘోర విద్యుత్ ప్రమాదం సంభవించింది. స్థానిక పెట్రోల్ బంక్ నుంచి భారీ ఇనుప స్టాండు తరలిస్తుండగా 11కేవీ విద్యుత్ లైన్ తగిలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నాగరాజు, దినసరి కూలీ నారాయణ మృతి చెందారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి CCTV ఫుటేజ్ లీక్ అయింది. ఫుటేజ్‌లో ప్రమాదం ఎలా జరిగిందో  స్పష్టంగా కనిపిస్తుంది. విద్యుత్ షాక్ తగిలిన ఇద్దరినీ కాపాడేందుకు స్థానికులు ఎంతగానో ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనతో భయపడిన స్థానికులు విద్యుత్ సేఫ్టీ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also: రైతులకు మోడీ గుడ్‌ న్యూస్.. త్వరలో పీఎం కిసాన్ నిధులు రిలీజ్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>