Mobile Popup Ad
Mobile Popup Ad

పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా!

కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలోని కొన్ని దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్‌ఈ (CBSE) కీలక నిర్ణయం తీసుకున్నది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో నిర్వహించాల్సిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. మార్చి 5 (గురువారం), మార్చి 6 (శుక్రవారం) తేదీలకు నిర్ణయించిన పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీబీఎస్‌ఈ సోమవారం జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. కొత్త పరీక్ష తేదీలను అనంతరం ప్రకటిస్తామని వెల్లడించింది.

మార్చి 7 నుంచి జరిగే పరీక్షలపై పరిస్థితిని మార్చి 5న సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. విద్యార్థులు తమ తమ పాఠశాలలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ అధికారిక ప్రకటనలను జాగ్రత్తగా గమనించాలని సూచించింది. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి డా. సంయమ్ భారద్వాజ్ సర్క్యులర్‌ విడుదల చేశారు. సంబంధిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, దుబాయ్‌లోని సీబీఎస్‌ఈ ప్రాంతీయ కార్యాలయానికి కూడా సమాచారం పంపినట్లు వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>