లీకేజీ, అవినీతి తప్ప అభివృద్ధి లేదు.. మోడీ ప్రభుత్వంపై సీపీఎం పైర్

కలం, మెదక్ బ్యూరో: మోడీ పాలనలో దేశంలో లీకేజీలు, అవినీతే తప్పా అభివృద్ధి ఉండదని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సంగారెడ్డి (Sangareddy) జిల్లా సీపీఎం (CPM) పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ మాట్లాడుతూ.. విద్యావేత్త సోనమ్ వాంగ్‌ చుక్ ఢిల్లీలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడంతో నిరసన గలాన్ని అన్చలేరని తెలిపారు. సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన శాంతియుత ఆమరణ నిరాహార దీక్ష పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మండి పడ్డారు.

సమస్యలను పరిష్కరించకుండా అణిచివేయాలనుకోవడం మోడీ ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నిరంకుశ చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: ప్రమాదంలో కోట్లాది యువత.. WHO సంచలన రిపోర్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>