బుమ్రా ఒక ‘చీట్ కోడ్’ స్పెల్: అభిషేక్ నాయర్

కలం, స్పోర్ట్స్​ : టీమిండియాకు బుమ్రా (Bumrah) ఒక చీట్ కోడ్ స్పెల్ లాంటోడంటూ సీనియర్ ప్లేయర్స్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar), ఆకాష్ చోప్రాలు ప్రశంసలుగుప్పించారు. వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కీలక పోరులో బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా సృష్టించిన ప్రకంపనలు, బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ ఆడిన అజేయ ఇన్నింగ్స్ ఈ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాయి.

వెస్టిండీస్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్న సమయంలో, జస్ప్రీత్ బుమ్రా వేసిన 12వ ఓవర్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ప్రమాదకరంగా కనిపిస్తున్న షిమ్రాన్ హెట్మెయర్, రోస్టన్ చేజ్‌లను ఒకే ఓవర్లో వరుసగా పెవిలియన్ చేర్చడం ద్వారా బుమ్రా విండీస్ జోరుకు బ్రేకులు వేశారు. తొలుత హెట్మెయర్‌ను అద్భుతమైన లెంగ్త్ బాల్‌తో అవుట్ చేసిన బుమ్రా, ఆ తర్వాత స్లో డెలివరీతో చేజ్‌ను బోల్తా కొట్టించారు.

బుమ్రా ప్రదర్శనపై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ ప్రశంసల జల్లు కురిపించారు. బుమ్రాను ఒక ‘చీట్ కోడ్’గా అభివర్ణించిన ఆయన, కొత్త బంతితోనైనా, డెత్ ఓవర్లలోనైనా బుమ్రా ఎప్పుడూ నిరాశపరచడని పేర్కొన్నారు. సెట్ అయిన ఇద్దరు బ్యాటర్లను ఒకే ఓవర్లో అవుట్ చేయడం ప్రత్యర్థి జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని నాయర్ అభిప్రాయపడ్డారు.

బుమ్రా (Bumrah) 36 పరుగులిచ్చి 2 వికెట్లు తీసినా, అతని ప్రభావం ఆ అంకెలకు అందదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. బుమ్రాను ఒక అద్భుత మేధావిగా, దేశ సంపదగా ఆయన కొనియాడారు. విండీస్ లాంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టును 200 పరుగుల లోపే కట్టడి చేయడంలో బుమ్రా కీలక పాత్ర పోషించారని చోప్రా వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>