కలం, వెబ్ డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కరీంనగర్లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమిత్ షా రాకను పురస్కరించుకుని కరీంనగర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు పోలీసు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పలువురు ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉండటంతో ఆయన పర్యటన స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే కీలక నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్ ప్రత్యేకంగా భేటీ కాగా.. తాజాగా అమిత్ షా పర్యటనతో తెలంగాణ రాజకీయాల్లో అన్యూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also: ప్రమాదంలో కోట్లాది యువత.. WHO సంచలన రిపోర్ట్
Follow Us On: X(Twitter)

