బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదైంది. జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక సందర్భంగా కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) హల్‌చల్ చేశారు. ఈ పరిణామాల్లో భాగంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రవర్తనతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని, శాంతి భద్రతలకూ భంగం కలిగించారన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మంగళవారం పోలింగ్ కొనసాగుతున్న సమయంలో కౌశిక్‌రెడ్డి అనుచరులతో కలిసి యూసుఫ్‌గూడ ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌హాల్‌కు వెళ్లారు. అక్కడ దొంగ ఓట్లు వేసేందుకు కొందరిని సమీకరించారన్న ఆరోపిస్తూ కౌశిక్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వెళ్లి హల్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించినప్పటికీ, కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy) వారిని పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన హాల్‌లోకి దూసుకెళ్లారని.. గొడవ సృష్టించేందుకు ప్రయత్నించారని సృష్టించారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై బాధ్యులైన అధికారులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. కౌశిక్‌రెడ్డిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి ఆరోపణల కింద ఫిర్యాదు స్వీకరించారు. ఆయన ప్రవర్తనపై సీసీటీవీ ఫుటేజీలు సేకరించి పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అవసరమైతే ఆయనను విచారణకు పిలుస్తామని కూడా సూచించారు. ఇది రాజకీయ ప్రేరిత చర్య అని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.
Read Also: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
Follow Us on: Instagram

