ఇటీవల బంగారం ధరల్లో(Gold Prices) ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరుస పెరుగుదలతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్ష 30 వేల రూపాయలు దాటగా, ఆ తర్వాత కొంతకాలంపాటు తగ్గుతూ వచ్చింది. లక్ష 22 వేల రూపాయల దగ్గర నిలిచింది. గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత బుధవారం స్వల్పంగా తగ్గాయి.
బుధవారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.33 తగ్గి రూ.12,551 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.30 తగ్గి రూ.11,505గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,510గా, 22 క్యారెట్ల ధర రూ.1,15,050గా నమోదైంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలను(Gold Prices) పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.330 తగ్గి రూ.1,25,510 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.300 తగ్గి రూ.1,15,050 పలుకుతోంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ప్రాంతాల వారీగా స్థానిక పన్నులు, డిమాండ్, రవాణా ఖర్చుల ఆధారంగా స్వల్ప తేడాలు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.
ఇక వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత మూడు రోజులుగా వెండి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. మొన్న కిలోపై రూ.4,500, నిన్న రూ.3,000, ఈ రోజు మరో రూ.2,000 పెరిగింది. బుధవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,62,000 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి రూ.1,73,000గా నమోదైంది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీరేట్లపై అనిశ్చితి, చైనా, రష్యా దేశాల బంగారం కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు కారణమని తెలిపారు. ఇక పారిశ్రామిక అవసరాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి వినియోగం పెరగడం వల్ల వెండి ధరలు మరింతగా ఎగబాకుతున్నాయని వారు పేర్కొన్నారు.
Read Also: వేములవాడలో దర్శనాలు బంద్
Follow Us on : Pinterest

