Mobile Popup Ad
Mobile Popup Ad

సింగర్ మంగ్లీపై పంజాగుట్ట‌లో కేసు న‌మోదు!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ సింగ‌ర్ మంగ్లీ (Singer Mangli)పై పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. సుబ్బారావు అనే న్యాయ‌వాది మంగ్లీపై శనివారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మంగ్లీ మ‌నుషులు త‌న‌ను యాక్సిడెంట్ చేసి చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె సోద‌రుడు శివ, మ‌రికొంద‌రితో క‌లిసి 150 మంది నుంచి రూ.10 కోట్లు వసూలు చేశార‌ని ఆయన ఆరోపించారు. గోకులానంద‌న ఇన్‌ఫ్రా ఇండియా పేరుతో పెట్టుబ‌డులు సేకరించారని, భారీ ఎత్తున లాభాలు ఇస్తామ‌ని చెప్పార‌ని పేర్కొన్నారు. డ‌బ్బులు వ‌సూలు చేసిన త‌ర్వాత నిందితులు ప‌రారయ్యారని చెప్పారు.

ఇప్పుడు మంగ్లీని (Singer Mangli) డ‌బ్బులు అడిగితే చంపేస్తాన‌ని బెదిరిస్తోంద‌ని, శవం కూడా దొరకకుండా చేస్తానని భ‌య‌పెడుతోంద‌ని సుబ్బారావు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు BNS 351(2), 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ, ఆమె సోద‌రుడు శివ, ద‌ర్శ‌కుడు వేణు ఉడుగులతో పాటు మరి కొందరిపై కేసు న‌మోదు చేసుకొని, ద‌ర్యాప్తు చేపట్టారు.

Read Also: కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. కానీ ఆ 30 నిమిషాలే సమస్య!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>