Mobile Popup Ad
Mobile Popup Ad

ఏబీఎన్ ఆఫీస్ ఎదుట నిరసన.. రోజా, భూమనపై కేసులు

కలం, వెబ్ డెస్క్: ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో అనుచిత కథనాలు వచ్చాయని నిరసిస్తూ వైసీపీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. హైదరాబాద్ సహా ఏపీలోని పలు నగరాల్లో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రజ్యోతి దినపత్రికలను దహనం చేశారు. తిరుపతిలో మాజీ మంత్రి రోజా (Roja), మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళనల్లో పాల్గొన్నారు. కాగా నగరంలో పోలీస్ యాక్ట్ – 30 అమల్లో ఉన్నప్పటికీ రోజా, కరుణాకర్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించడంతో వారి మీద కేసులు నమోదు చేశారు.చట్టాన్ని ఉల్లంఘించి ర్యాలీలు, నిరసనలు చేపట్టడంతో కేసులు నమోదు చేసినట్టు తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు క్లారిటీ ఇచ్చారు. రోజా, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి తదితరుల పేర్లు కూడా చేర్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>