రాహుల్ గాంధీపై కామెంట్స్.. కేటీఆర్‌పై కేసు నమోదు

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చావ్ అంటూ కామెంట్స్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై క్రిమినల్ కేసు నమోదు అయింది. బుధవారం రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ గాంధీపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అగ్రనేతను కేటీఆర్ దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాయిని ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్న సుబేదారి పోలీసులు.. కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి ఎన్నికల ముందు వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేవుళ్లపై ఓట్లు పెట్టి.. ఓట్లు దొబ్బారని మండిపడ్డారు. ఓట్ల ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పారని.. ఇప్పుడేమో దొకేబాజ్ ముచ్చట్లు చెప్పారని ఫైర్ అయ్యారు. ఏమయ్యా రాహుల్ గాంధీ నువ్వు చేసిన డిక్లరేషన్ ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావ్ రాహుల్ గాంధీ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>