కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని తంజావూర్ నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన విజయ్‌శరవణన్ (TVK MLA Vijaysaravanan) మద్యం మత్తులో రోడ్డుపై డాన్స్‌లు చేస్తూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. చేతిలో మందుబాటిల్ పట్టుకుని అనుచరులతో కలిసి రోడ్డుపక్కనే ఆయన చిందులేయడం వీడియోలో కనిపిస్తోంది. ఎన్నికలలో విజయం సాధించిన ఆనందంలో ఇలా మద్యం సేవించి వేడుకలు జరుపుకున్నట్లు సమాచారం.
అయితే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడంపై పలువురు నెటిజన్‌లు , రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా ప్రవర్తించడం సరైంది కాదు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. టీవీకే పార్టీ నుంచి దీనిపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.

