కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా (Suryapet District) లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం పరిధిలోని దొరకుంట (Dorakunta) వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తెల్లవారుజామున డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతో బస్సు అదుపుతప్పి ముందువెళ్తున్న డీసీఎంను బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

