మహారాష్ట్రలో లోయలో పడ్డ కారు.. 8 మంది మృతి

కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లోని రాయ్‌గఢ్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రవమాదశాత్తు కారు లోయలో పడిపోవడంతో 8 మంది మృతి చెందారు. పోలాద్‌పూర్-మహాబలేశ్వర్ రోడ్డులోని అంబెనాలి ఘాట్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా సతారాకు చెందిన వారని వెల్లడించారు. ప్రయాణికులు దాపోలి నుంచి సతారాకు ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిందని సీనియర్ పోలీసు అధికారి వివరించారు. ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలు వెలికితీశారు. ప్రమాదం జరిగిన లోయ సుమారు 1,000 అడుగుల లోతు ఉంటుందని అక్కడివారు చెబుతున్నారు.

Read Also: ఉదయనిధి విమర్శలకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>