కలం, వెబ్ డెస్క్ : ఓ ప్రైవేట్ బస్సులో ఆకస్మికంగా మంటలు (Bus Catches Fire) చెలరేగడం గమనించిన ఆటో డ్రైవర్ హెచ్చరికతో పెను ప్రమాదం తప్పింది. పుదుచ్చెరి నుంచి కడలూరు మీదుగా పొల్లాచ్చికి సోమవారం రాత్రి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభం అయ్యాయి. దీన్ని బస్సు వెనుక వస్తున్న ఓ ఆటో డ్రైవర్ గమనించి విషయాన్ని బస్సు డ్రైవర్ కు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కనే నిలిపివేసి.. ప్రయాణికులను బయటకు వెళ్లిపోవాలని హెచ్చరించాడు.
మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అరుపులు, కేకలు వేస్తూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే కిందకు దిగడంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వాళ్లు వచ్చే లూపే బస్సు పూర్తిగా దగ్ధమయింది. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన కారణంగా పుదుచ్చేరి (Puducherry) – నూరడి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు అసలు కారణాలపై దర్యాప్తు మొదలు పెట్టారు. బస్సు డ్రైవర్ ను అప్రమత్తం చేసిన ఆటో డ్రైవర్ కు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
Read Also: రూ.3 లక్షల దిశగా దూసుకెళ్తున్న సిల్వర్.. పుత్తడి ధర ఎంతంటే?
Follow Us On: Sharechat


