కలం, వెబ్ డెస్క్ : వెండి ధరలు (Silver Rates) భారీగా పెరిగిపోతున్నాయి. గ్లోబల్ పాలిటిక్స్ లో నెలకున్న ఉద్రిక్తతల కారణంగా సిల్వర్ పరుగులు పెడుతోంది. ఈ పరిస్థితులే కొనసాగితే త్రైమాసికంలో కిలో వెండి రూ.3 లక్షలు దాటడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నువ్వా నేనా అంటూ పుత్తడితో పోటీ పడుతూ అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేట్లు భారీగా ఎగబాకుతున్నాయి. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ (EVs), వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో వెండి విరివిగా ఉపయోగిస్తుండడం, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా దీని ధరలు పెరుగతున్నాయి.
గ్లోబల్ మైనింగ్ (Global Mining) ఉత్పత్తి తగ్గిపోవడం, సప్లైలో కొరత ఏర్పడటం వల్ల మార్కెట్‌లో బ్యాలెన్స్ దారితప్పింది. దీనికి తోడుగా ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్, జియోపొలిటికల్ టెన్షన్స్ వంటి అంశాలు సిల్వర్ రేట్ల జిగేల్ కు మరింత బూస్ట్ ఇస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఒక ఔన్స్‌కు సుమారు 85-86 డాలర్లుగా ఉండగా, ఇటీవలి రోజుల్లో రికార్డు స్థాయిలకు చేరుకుంది. త్వరలోనే ఇది 95 నుంచి 110 డాలర్ల మధ్యకు పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ధరలు దేశ మార్కెట్ పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి అంతర్జాతీయంగా ఈ స్థాయికి చేస్తే భారత్ లో వెండి ధరలు (Silver Rates) సులభంగా కిలోకు మూడు లక్షల మార్కును దాటే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూపాయలు రెండున్నర లక్షల నుంచి 2.7 లక్షల మధ్య ఉంది. పుత్తడితో పోలిస్తే వెండి ధరలు భారీ ఒడిదుడుకులను చోటు చేసుకుంటుంది. దీనివల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉంటూ సరైన అంశాలతో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. మొత్తం పోర్ట్ఫోలియోలో విలువైన ఖనిజాలకు ఐదు నుంచి 10 శాతం వాటా మాత్రమే కేటాయించడం మంచిది అంటున్నారు. సప్లై కొరత కారణంగా రానున్న రోజుల్లో సిల్వర్ ధరలు మరింత దూసుకుపోయే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
బంగారం ధరలు ఎంతంటే?
అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం (Gold) రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. తులం పసిడి లక్షా యాభైవేల వైపు వెళ్తోంది. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.380 పెరిగి రూ.1,47,530 కు చేరింది.
Read Also: లైన్ లో ఆ నలుగురు.. అనిల్ నెక్ట్స్ మూవీ ఎవరితో..?
Follow Us On : WhatsApp


