కలం, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి యాక్షన్-కామెడీ చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు (Chiranjeevi MSG) జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సానుకూల స్పందన వచ్చింది. ఇది మంచి కలెక్షన్లు సాధించేందుకు మైలేజ్ ఇచ్చింది. టాలీవుడ్ వర్గాల ప్రకారం.. ఈ చిత్రం మొదటి రోజున దాదాపు రూ. 28.50 కోట్ల వసూళ్లు చేసింది. ముందస్తు బుకింగ్ ద్వారా అదనంగా రూ.8.60 కోట్లు రాబట్టింది. మొదటి రోజు మొత్తం దాదాపు రూ. 37.10 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది మెగాస్టార్‌కు సంక్రాంతికి బలమైన ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. సోమవారం మొత్తం మీద ఫుల్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఫుల్ అయ్యాయి. ఉదయం షోలు 48.74 శాతం, మధ్యాహ్నం 59.82, సాయంత్రం 71.20, రాత్రి షోలు 78.87 శాతంగా ఉన్నాయి. సంక్రాంతి సెలవులు కావడంతో రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని కలెక్షన్లు సాధించేలా ఉంది. ఈ చిత్రంలో చిరంజీవి శంకర వర ప్రసాద్ టైటిల్ రోల్ పోషించగా, వెంకటేష్ వెంకీ గౌడగా, శశిరేఖగా నయనతార కనిపించారు.

Read Also: జన నాయగన్ సెన్సార్ వివాదం: సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్
Follow Us On: Instagram


