ములుగులో ప్రైవేట్ బస్సులో గుడుంబా తరలింపు..!

కలం, ములుగు: ఓ ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 210 లీటర్ల గుడుంబాను ములుగు పోలీసులు (Mulugu Police) పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఓ ప్రైవేట్ బస్సును ఆపి పరిశీలించగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 210 లీటర్ల గుడుంబా బయటపడింది. వెంటనే గుడుంబాను స్వాధీనం చేసుకున్న పోలీసులు, రవాణాకు ఉపయోగించిన ప్రైవేట్ బస్సును సీజ్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుడుంబా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అక్రమ మద్యం తయారీ, రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>