నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి.. రేవంత్, కేసీఆర్ నివాళులు

కలం, వెబ్ డెస్క్: అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహనీయునికి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ జయంతి రోజున జరుపుకునే “సమతా దివస్” సందర్భంగా, సమాజంలోని వివక్షలకు వ్యతిరేకంగా సమానత్వం, ఐక్యత, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) జయంతి (ఏప్రిల్ 5) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతికి వారు అందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా వారి పోరాటం కొనసాగిందని గుర్తుచేశారు. రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ వంటి శాఖలకు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించి, స్వాతంత్రానంతరం స్వయంపాలనలో దేశ ప్రగతి కోసం తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దళిత కులాలకు సామాజిక న్యాయం అమలు దిశగా గొప్ప కృషి సాగిందని చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి వంటి పదవులతో నాటి ప్రభుత్వంలో ఎస్సీ కుల నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. దళితుల సాధికారత కోసం దళిత బంధు వంటి విప్లవాత్మక పథకాన్ని అమలు చేయడంలో బాబు జగ్జీవన్ రామ్ ఆలోచనల స్ఫూర్తి ఇమిడి ఉన్నదని తెలిపారు. దళిత బహుజన కులాలకు, రాజకీయ ఆర్థిక, తదితర రంగాల్లో సామాజిక న్యాయం దక్కినప్పుడే బాబు జగ్జీవన్ రామ్‌కి మనమందిచే ఘన నివాళి అని పేర్కొన్నారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>