epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

BSNL 5జీ ఎప్పుడు.. JIO, AIRTEL రేట్లు పెంచేది అప్పుడేనా..?

కలం, వెబ్ డెస్క్ : భారత టెలికాం రంగంలో భారీ మార్పు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఎందుకంటే JIO, AIRTEL, VI సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచడానికి రెడీ అవుతున్నారు. 2024లో రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన ఈ సంస్థలు.. ఈ ఏడాది మరోసారి పెంచడానికి రెడీ అయ్యాయి. వాస్తవానికి ఈ 2026 జనవరిలోనే పెంచుతాయని అంతా అనుకున్నారు. కానీ ధరల పెంపు విషయంలో ఈ సంస్థలు మూకుమ్మడిగా వెనకడుగు వేశాయి. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ.. వచ్చే జూన్ నాటికి పెంచుతాయని తెలుస్తోంది. అన్ని సంస్థలు ఒకే తరహాలో పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ధరల మీద 15 నుంచి 20 శాతం దాకా పెంచబోతున్నాయంట.

ఇక్కడే అందరి చూపు బీఎస్ ఎన్ ఎల్ (BSNL) మీద ఉంది. గతేడాది 4జీ నెట్ వర్క్ లోకి వచ్చిన బీఎస్ ఎన్ఎల్ ను ఈ జనవరిలోపే 5జీ నెట్ వర్క్ కు కన్వర్ట్ చేస్తామని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా గతంలోనే ప్రకటించారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో బీఎస్ ఎన్ ఎల్ పునరుద్ధరణ కోసం రూ.80వేల కోట్ల దాకా కేటాయించారు. వాటితో దేశ వ్యాప్తంగా 92,564 బీఎస్ ఎన్ ఎల్ టవర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ 4జీ టవర్లనే 5జీలోకి మార్చుతామని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా గతంలోనే చెప్పారు. కాకపోతే దానికి ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. వచ్చే మే నెలలోపు బీఎస్ ఎన్ ఎల్5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ఆ సంస్థ అధికారులు కొన్ని మీడియా సంస్థలతో చెబుతున్నారు.

ప్రైవేట్ సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వీఐ రీఛార్జ్ ధరలు పెంచితే చాలా మంది బీఎస్ ఎన్ ఎల్ కు కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. మిగతా వాటితో పోలిస్తే బీఎస్ ఎన్ ఎల్ రీఛార్జ్ ధరలు తక్కువగానే ఉన్నాయి. 5జీ నెట్ వర్క్ తీసుకొచ్చినా రీఛార్జ్ ధరలను పెంచేందుకు బీఎస్ ఎన్ ఎల్ ఇప్పట్లో సిద్ధంగా లేదు. 4జీ నెట్ వర్క్ తీసుకొచ్చినప్పుడు ఇతర మొబైల్ నెట్ వర్క్ ల నుంచి బీఎస్ ఎన్ ఎల్ లోకి లక్షల మంది కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు బీఎస్ ఎన్ ఎల్ 5జీ వస్తే అన్ని ప్రైవేట్ సంస్థల నుంచి బీఎస్ ఎన్ ఎల్ కు భారీగా పోర్టబిలిటీ ద్వారా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే బీఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్ స్పీడ్ మీద మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని యూజర్లు సూచిస్తున్నారు. మరి ఈ ఏడాది టెలికాంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>