కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో (Muncipal Elections ) పోటీ చేస్తామని జనసేన పార్టీ (Janasena ) ఇప్పటికే ప్రకటించించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ మరో అడుగు ముందుకేసింది. ఈ క్రమంలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల కోసం కో ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసింది. మొత్తం 11 మందితో కూడిన ఈ కమిటీలో ఉమ్మడి జిల్లాల వారిగా ఒకరి చొప్పున బాధ్యతలు అప్పగించారు.
కొండగట్టు పర్యటనకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో జనసేనను విస్తారిస్తామని చెప్పిన కొద్ది రోజులకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిచ్చారు. జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు పుర ఎన్నికలకు సిద్ధం కావాలని అధినేత పిలుపునిచ్చాడు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న Janasena అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోనూ తమ పార్టీని బలపర్చాలని నిశ్చయించుకున్నాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆయన ఇచ్చిన ఈ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీతో పొత్తు ఉంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ Muncipal Elections లో కాషాయ పార్టీతో పవన్ కలిసి నడుస్తాడా అన్న ప్రశ్నకు బీజేపీ చీఫ్ రామచందర్ రావు స్పందిచారు. తాము జనసేనతో కలిసి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కాగా, ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


