Mobile Popup Ad
Mobile Popup Ad

కరకగూడెంలో దారుణం.. ఆదివాసీ దారుణ హత్య

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం (Karakagudem) మండలంలోని అశ్వాపురపాడు గ్రామంలో కోవాసి వెంకటేష్ అనే ఆదివాసీ దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కరకగూడెం మండలంలోని అశ్వాపురపాడు ఒక గుత్తికోయ వలస గ్రామం. ఇక్కడ మూఢనమ్మకాలు అధికంగా ఉండటం గమనార్హం.

Read Also: గల్భ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారికి అండగా ఉంటాం : మంత్రి పొన్నం

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>