epaper
Sunday, March 1, 2026
epaper

యాదాద్రిలో ఘోరం.. సుత్తితో కొట్టి భర్తను చంపిన భార్య

కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ భార్య త‌న భ‌ర్త‌ను సుత్తితో కొట్టి అత్యంత కిరాతకంగా చంపేసింది. గుండాల మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. భిక్షం, ఉపేంద్ర దంపతులు గుండాల మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన భార్య ఉపేంద్ర ఇంట్లో ఉన్న‌ సుత్తిని తీసుకొని భర్త భిక్షం తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో భిక్షం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే నిందితురాలు ఉపేంద్ర గత కొంతకాలంగా మతిస్థిమితం లేక ఇబ్బంది పడుతోందని, ఆ స్థితిలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ హత్యకు కుటుంబ కలహాలు కారణమా? అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలు ఉపేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

Read Also: పేదల ఇండ్లు కూల్చి ఏం సాధిస్తారు : రామచందర్ రావు

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!