సీఎం చంద్రబాబుపై డీఎస్పీ ఫిర్యాదు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలో ఆస‌క్తిక‌ర‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సీఎం చంద్ర‌బాబు (Chandrababu)పై ఓ పోలీసు అధికారి ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. సీఎం చంద్ర‌బాబు స‌హా కూట‌మి నేత‌లంతా తిరుమ‌ల ల‌డ్డూ (Tirumala Laddu)లో జంతు కొవ్వు క‌లిసింద‌ని, క‌ల్తీ నెయ్యి వాడార‌ని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై డీఎస్పీ దేవ‌ర‌కొండ నాగ‌ వ‌రప్ర‌సాద్ (DSP Naga Varaprasad) పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. త‌మ కుల దైవం ఎరుక‌ల నాంచార‌మ్మ ఎరుక చెప్ప‌డం వ‌ల్లే శ్రీనివాసుడి క‌ళ్యాణం జ‌రిగింద‌ని ప్ర‌సిద్ధి అని తెలిపారు. త‌మ‌కు ప్ర‌ధాన దైవ‌మైన వేంక‌టేశ్వ‌ర స్వామి ల‌డ్డూ ప్ర‌సాదంపై దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డం తీవ్రంగా క‌లిచివేసింద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో తుళ్లూరు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. ఎస్సై త‌నతో మాట్లాడార‌ని, ఫిర్యాదుపై లీగ‌ల్‌గా తీసుకోద‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు (Chandrababu), డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌, ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి, ఈటీవీ, చెరుకూరి కిర‌ణ్, వేమూరి రాధాకృష్ణ‌, మ‌హాన్యూస్ వంశీకృష్ణ‌, తిరుమ‌ల ల‌డ్డూపై డిబేట్ల‌లో దుష్ప్ర‌చారం చేసిన వాళ్ల‌పై ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. ఆయ‌న ప్ర‌స్తుతం మెడిక‌ల్ లీవ్‌ తీసుకొని విజ‌య‌వాడ‌లో నివాసం ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

Read Also: రాయలసీమ ఎత్తిపోతల కోసం ప్రజా ఉద్యమం : సజ్జల

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>