Mobile Popup Ad
Mobile Popup Ad

గల్భ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారికి అండగా ఉంటాం : మంత్రి పొన్నం

కలం, డెస్క్ : గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారికి అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారిని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్  (Ponnam Prabhakar) మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు, తెలంగాణ వారు ఉన్నారని.. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిది అన్నారు.

గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి సమాచారం అందజేయాలి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. ఎవరూ ఆందోళన చెందొద్దు. దాడులు ఎక్కువగా జరుగుతున్న గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వారిని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>