కలం, వెబ్ డెస్క్: ఆరు గ్యారంటీలకు (Six Guarantees) చట్టబద్దత కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారుచేశామని, ఈ బిల్లును రాష్ట్ర శాసన సభలో, శాసన మండలిలో వచ్చే శుక్రవారం ప్రవేశ పెట్టనున్నామని కేటీఆర్ తేల్చిచెప్పారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అభయహస్తం హామీ అతి పెద్ద ఫ్రాడ్ అని, ఆరు గ్యారంటీల్లో ఆర గ్యారంటీ కూడా అమలు కాలేదని మండిపడ్డారు.
‘‘ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే లాభమేంటి అని కొందరికి సందేహం ఉండవచ్చు. మొన్న రేవంత్ రెడ్డి ట్రాఫిక్ చలాన్లు నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ చేసుకుంటాము అని చెప్పినట్లు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత వస్తే మీకు రావాల్సిన హామీలకు సంబంధించిన అన్ని డబ్బులు నేరుగా ప్రభుత్వం నుండి మీ బ్యాంకు ఖాతాల్లో పడతాయి’’ అని కేటీఆర్ అన్నారు.
ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు కోట్ల మంది ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ ప్రమాణ స్వీకారం రోజున ఆరు గ్యారంటీలకు తొలి సంతకం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ తర్వాత వారం రోజులకు అప్పటి గవర్నర్ తమిళిసై ఉభయ సభలనుద్దేశించి ఆరుగ్యారంటీల అమలుపై మాట్లాడారని అన్నారు. 800 రోజులు గడిచినా కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు.

