కలం, నిజామాబాద్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా నిజామాబాద్ (Nizamabad) ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి. పార్టీ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకూ నల్ల జెండాలతో నాయకులు ఊరేగింపు చేపట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాటతో గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నగర మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా నగర అధ్యక్షుడు రాజు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు వారిని అడ్డుకుని పార్టీ కార్యాలయానికి తరలించారు.
కేసీఆర్‌పై కాంగ్రెస్ (Congress) పార్టీ కుట్ర పన్నుతోందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తే వేధింపులు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌పై కక్ష్య సాధింపు చర్యలు మానుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.


