కలం, వెబ్ డెస్క్: ఎప్పుడూ లేనిది ఆదివారం కేంద్ర బడ్జెట్ (Union Budget) రావడంతో దానికి తోడు మన స్టాక్ మార్కెట్ కూడా ఫస్ట్ టైమ్ ఆదివారం ట్రేడ్ అయింది. ఉదయం అక్కడక్కడే కదలాడిన ఇండెక్స్ లు.. నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ మొదలుపెట్టగానే కూలడం స్టార్ చేశాయి. ఒకానొక సందర్భంలో కీలకమైన సెన్సెక్స్ దాదాపు 2,500 పాయింట్లు (2.3 శాతం), నిఫ్టీ 500కుపైగా పాయింట్లు (2.5శాతం) నష్టపోయాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు 2 శాతానికిపైగానే పడిపోయాయి.
హెచ్ డీఎఫ్ సీ, రిలయెన్స్, ఐసీఐసీఐ వంటి స్టాక్స్ భారీగా నష్టాలను చవిచూశాయి. పొగాకు ఉత్పత్తులపై ట్యాక్స్ ఉంటాయని నెలరోజులుగా వస్తున్న కథనాలతో ఇప్పటికే 15 శాతం పడిపోయిన ఐటీసీ స్టాక్ ఈరోజు కూడా 3 శాతానికిపైగా కుప్పకూలింది. ఫార్మా, ఐటీ స్టాక్స్ మాత్రం గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. మొత్తంగా ఇన్వెస్టర్లకు స్పెషల్ ‘బడ్జెట్ సండే’ (Sunday Union Budget) కాస్త ‘బ్లాక్ సండే’గా మారింది.
కారణాలు:
1.స్టాక్ మార్కెట్లలోని ఫ్యూచర్స్ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ (ఎస్ టీటీ)ని 0.05%, ఆప్షన్స్ పై 0.15 శాతం బడ్జెట్ లో పెంచడం.
2.ప్రస్తుతం ఫ్యూచర్స్ పై 0.02%, ఆప్షన్స్ పై 0.1% ఉండగా.. దాన్ని భారీగా పెంచడం మార్కెట్ వర్గాలకు నచ్చలేదు.
3.ఇలాంటి వాటి వల్ల ట్రాన్సాక్షన్ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫారెన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి వెళ్లిపోతుండటంతో కేంద్రం ఎస్ టీటీని మరింత పెంచడంతో వారు ఇంకా వెళ్లిపోయే అవకాశం కనిపిస్తున్నదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also: సాదాసీదాగా కేంద్ర బడ్జెట్.. వరాలు లేవు.. వడ్డింపులు లేవు
Follow Us On: X(Twitter)


