Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మె (TGSRTC Strike) అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయం ప్రస్తుతం కమిటీ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రెండు ప్రధాన సమస్యలను మినహాయించి మిగతా అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బందికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

అదేవిధంగా, కొంతమంది ప్రేరేపితంగా సమ్మెలకు వెళ్లకుండా ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. పెండింగ్‌లో ఉన్న డీఏ (DA)ను ఇప్పటికే చెల్లించామని, పీఆర్‌సీ (PRC) విషయంపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ఆందోళనలకు శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పేర్కొన్నారు.

 Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>