కలం, వెబ్‌డెస్క్: కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని తెలంగాణలో నిరసనలు ఉధృతం అవుతున్నాయి. బండి భగీరథ్ (Bandi Bhageerath) ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ (Medchal) రహదారిపై బీఆర్ఎస్ (BRS) నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా బండి సంజయ్, భగీరథ్ ఫోటోలు తగలబెట్టి నిరసన తెలిపారు. బండి సంజయ్ ఖబడ్దార్ అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా ఇటీవల బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ బాధిత బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి 2 రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

