పాక్, బంగ్లాదేశ్ సిరీస్‌లకు ఆస్ట్రేలియా జట్లు ఖరారు

కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్, బంగ్లాదేశ్ పర్యటనలకు ఆస్ట్రేలియా క్రికెట్ (Australia Cricket) జట్టు సిద్ధమవుతోంది. ఈ పర్యటనల కోసం జాతీయ సెలక్షన్ ప్యానెల్ తాజాగా వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. ఈ జట్లలో కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడంతో పాటు సీనియర్లకు మళ్ళీ చోటు కల్పించారు. మొదటగా ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుంది. మే 30 నుంచి జూన్ 4 వరకు రావల్పిండి, లాహోర్‌లలో మూడు వన్డేలు ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌కు వెళ్తుంది. అక్కడ జూన్ 9 నుంచి 14 వరకు మూడు వన్డేలు, జూన్ 17 నుంచి 21 వరకు చటోగ్రామ్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌ల ద్వారా కొందరు యువ ఆటగాళ్లు తొలిసారి జాతీయ జట్టులోకి వస్తున్నారు.

సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన లియామ్ స్కాట్, విక్టోరియా బ్యాటర్ ఆలీ పీక్ వన్డే జట్టులోకి వచ్చారు. అలాగే బిగ్ బాష్ లీగ్‌లో అదరగొట్టిన సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు జోయెల్ డేవిస్ బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. చాలా కాలం తర్వాత ఫాస్ట్ బౌలర్లు బిల్లీ స్టాన్‌లేక్, రిలే మెరెడిత్ తిరిగి జట్టులోకి వచ్చారు. స్పిన్నర్ తన్వీర్ సంఘా రెండు వన్డే జట్లలోనూ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న ట్రావిస్ హెడ్, కూపర్ కానలీ, బెన్ ద్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్ బంగ్లాదేశ్ వన్డే సిరీస్ సమయానికి జట్టుతో కలుస్తారు.

టీ20ల కోసం లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్, ఆరోన్ హార్డీ మళ్ళీ జట్టులోకి వచ్చారు. కొత్త ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రావడం సంతోషకరమని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ జార్జ్ బెయిలీ పేర్కొన్నారు. అనుభవం ఉన్న ఆటగాళ్లు, కొత్త వాళ్ల కలయిక ఉపఖండ పర్యటనలకు బాగా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను అన్ని రకాల పరిస్థితులకు సిద్ధం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఇల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, రిలే మెరెడిత్, ఆలీ పీక్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, మాథ్యూ షార్ట్, బిల్లీ స్టాన్‌లేక్, ఆడమ్ జంపా.

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఇల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపా.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఇల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>