గులాబీ తోరణాలు తొలగించారని బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా

కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఏర్పాటు చేసిన గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలను GWMC సిబ్బంది తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ సర్కారు కావాలనే ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించారు. గులాబీ జెండా ఎగిరినా, కేసీఆర్ సైన్యం కనబడినా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోంది ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన రైతుల పక్షాన, తెలంగాణ ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.

Read Also: మార్గదర్శి కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>