మోదీ సభను డైవర్ట్ చేసేందుకే సీబీఐ డ్రామాలు.. బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన విజయంతోపాటు హైదరాబాద్‌లో జరగబోయే నరేంద్రమోదీ సభను డైవర్ట్ చేసేందుకే సీఎం రేవంత్ సీబీఐ విచారణ (CBI Probe) పేరుతో డ్రామాలాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మండుటెండలో రైతులు అరిగోస పడుతున్నా, వడదెబ్బకు తాళలేక చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తాలు, తరుగు పేరుతో దళారులను రైతులను దోచుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

మంగళవారం కరీంనగర్ ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బండి సంజయ్ సందర్శించి, రైతులతో మాట్లాడారు. తరుగు పేరుతో బస్తాకు నాలుగైదు కేజీలు దోచుకుంటున్నారని రైతులు బండి సంజయ్‌ ముందు వాపోయారు. ఒక్కో రైతు సగటున రూ.20 వేలకుపైగా నష్టపోయే దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించేలా చర్యలు తీసుకుంటానని రైతులకు బండి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండుటెండలో రోజుల తరబడి వాళ్లు వడ్లను విక్రయించేందుకు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శంచారు.

‘‘ఇంకెంతమంది రైతులను బలికొంటారు? రైతులు చస్తున్నా వడ్లను కొనుగోలు చేయరా? అంటూ రేవంత్‌పై మండిపడ్డారు. వడ్లు కొన్నందుకు ప్రభుత్వానికి కమీషన్ కూడా ఇస్తున్నాం కదా అని ఆయన ప్రశ్నించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే.. ఇప్పటిదాకా 15 లక్షల మెట్రిక్ టన్నులే కొంటారా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. కేంద్రం ఎస్టీ విద్యార్థుల రీయంబర్స్‌మెంట్ కోసం నిధులు మంజూరు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకోలేదని మండిపడ్డారు. ‘6 గ్యారంటీలు అమలు చేయడానికి పైసల్లేవంటారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వడానికి నిధుల్లేవంటారు. ఢిల్లీకి కప్పం కట్టడానికి, కేరళ ఎన్నికల కోసం ఖర్చు చేయడానికి వేల కోట్లు ఇస్తారు. రైతులు చచ్చిపోతుంటే స్పందించాలనే సోయి కూడా లేదా?’ అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై ఎంక్వైరీ కమిషన్ నివేదిక ఇచ్చి ఏడాదిన్నర దాటినా ఎందుకు చర్యలు తీసుకోలేదని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ము లేదని, బీఆర్ఎస్‌తో బేరసారాలు చెడిపోయాయి కాబట్టే, కేంద్రానికి లేఖ రాస్తున్నారని బండి సంజయ్ (Bandi Sanjay) ఘాటు ఆరోపణలు చేశారు.

Read Also: తడిసిన ధాన్యంపై రైతులకు భరోసా.. ఉత్తమ్ కీలక నిర్ణయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>