epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జగిత్యాలలో బీఆర్ఎస్​ కు దిక్కెవరు..?

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial)లో తిరుగులేని నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డిని ఓడించి 2018, 2023 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ పార్టీ విజయాలు సాధించి నియోజకవర్గంపై కాంగ్రెస్ పైచేయి సాధించింది. రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయం సాధించడంతో జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు ఉండదని అందరు భావించారు. 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది.

కవిత ఎంట్రీ..

2023లో గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత జగిత్యాల(Jagtial) బరిలో నిలుస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బహిష్కరణ తరువాత జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి దిక్కు లేకుండా పోయింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినప్పటికీ జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు పార్టీ ఇంచార్జీని నియమించలేదు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న జగిత్యాలలో ఇంచార్జీ లేక పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు.

పంచాయతీ ఎన్నికల్లో కనిపించని ప్రభావం..

జగిత్యాల(Jagtial) నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. నియోజకవర్గంలో 101 సర్పంచ్ లకు గాను 93మంది కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్ధులు విజయం సాధించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య వివాదం రోజు రోజుకు పెరిగిపోయినప్పటికీ జగిత్యాలలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోవడం విశేషం. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎవ్వరు దిక్కు లేకపోవడంతోనే కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జగిత్యాలలో గెలిచిన కాంగ్రెస్ స్థానాల క్రెడిట్ కోసం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డిలు ఆరాటపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>