Mobile Popup Ad
Mobile Popup Ad

‘డెకాయిట్’ ట్రైలర్‌పై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు..

కలం, సినిమా : టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘డెకాయిట్’ (Dacoit). టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా  ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో, ఈ చిత్రంపై భారీగా చర్చ సాగుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమా ట్రైలర్‌పై స్పందించడంతో సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది.

తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఎన్టీఆర్.. ‘డెకాయిట్’ ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. ఎంతో అద్భుతంగా తీశారు అంటూ చిత్రబృందాన్ని అభినందించారు. అలాగే హీరో అడివి శేష్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో పాటు మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 10 కోసం ఎదురు చూస్తున్నాను.. అని ఎన్టీఆర్ పేర్కొనడంతో  అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ చిత్రం కథ, యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా అడివి శేష్ ప్రత్యేకమైన కథలను ఎంచుకునే నటుడిగా పేరుపొందడం కూడా ఈ సినిమాపై (Dacoit) అంచనాలను పెంచుతోంది.

Read Also: ప్రేమ ఒక్కసారేనా.. మళ్లీ మళ్లీ కలగదా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>