Mobile Popup Ad
Mobile Popup Ad

KCR గుర్తులను చెరిపేసే కుట్ర : మాజీ మంత్రి

కలం, వెబ్ డెస్క: రాష్ట్రంలోని లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిలదీశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ (KCR) సైతం వైఎస్సార్ పేరును ప్రస్తావిస్తూనే కొనసాగించారని ఆమె గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడం చూస్తుంటే, రాష్ట్రంలో కేసీఆర్ గుర్తులతో పాటు వైఎస్సార్ గుర్తులను కూడా చెరిపేసే కుట్ర జరుగుతోందని భావించాల్సి వస్తుందని ఆమె అన్నారు.

రాష్ట్రంలో ఏటా దాదాపు 13 లక్షల మంది BC, SC, ST మైనారిటీ విద్యార్థులు ఈ పథకంపైనే ఆధారపడి చదువుకుంటున్నారని, ప్రస్తుతం ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు సుమారు 12 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆమె వివరించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ బకాయిల అంశం విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఆందోళనకు దారితీస్తోందని, వారి చదువులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాలేజీ యాజమాన్యాలు తమకు రావలసిన నిధుల గురించి అడిగితే ప్రభుత్వం వారిని భయపెట్టే ప్రయత్నం చేసిందని ఆమె విమర్శించారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి, ఫీజు రీయింబర్స్ మెంట్ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టమైన ప్రకటన చేయాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలుగుతుందని సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) పేర్కొన్నారు.

Read Also: కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీశ్ రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>