epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అహ్మదాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

దోహా నుంచి హాంకాంగ్ వెళ్తున్న ఖతర్ ఎయిర్‌వేస్(Qatar Airways) విమానం అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసింది. విమానం QR816లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని అహ్మదాబాద్‌వైపు మళ్లించారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉననారు. ప్రస్తుతం విమానం కండిషన్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ‘‘మధ్యాహ్నం 2:12 గంటల సమయంలో విమానం ల్యాండింగ్‌కు ఓకే చెప్పాం. 2:32 గంటల సమయంలో ల్యాండింగ్ పూర్తయింది. 2:38 గంటలకు ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నాం. విమానాశ్రయం కార్యకలాపాలు యథావిథిగా కొనసాగుతున్నాయి’’ అని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారిక ప్రతినిధి వెల్లడించారు.

Read Also: కమీషన్లు రావనే గురుకులాలకు నిధులు బంద్: హరీష్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>