సూర్యాపేట(Suryapet) నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి కోసం కాంగ్రెస్‌లో హోరోహారీ పొటీ మొదలైంది. ఈ రేసులో దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో దామోదర్ రెడ్డి(Damodar Reddy) పేరుతో రాజకీయంగా కీలకంగా మారింది. ఆయన మరణించి 15 రోజులు కూడా గడవక ముందే ఆయన పేరు చెప్పి పదవి తమకు ఇవ్వాలని కోరుతుండటం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అయితే గాంధీ భవన్‌లో రెండు వర్గాలో ఫెక్సీలు భారీగా పెట్టాయి. దామోదర్ రెడ్డి చనిపోవడంతో సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి పటేల్ రమేష్ రెడ్డి(Patel Ramesh Reddy)కి ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు, దామోదర్ రెడ్డి పార్టీకి ఎంతో చేశారు ఆయన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డికి ఇన్‌ఛార్జ్ పదవి ఇవ్వాలంటూ వెలసిన దామోదర్ రెడ్డి వర్గీయుల పోటీ పోటీగా ఫెక్సీలు కట్టారు. దీనిని ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. ఒక నేత చనిపోతే ఆయన పేరుతో కూడా రాజకీయం చేసే సంప్రదాయం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని ఈ ఫ్లెక్సీ వార్ స్పష్టం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు.

