రక్షకుడే భక్షకుడు అయ్యారు.. సీఎం రేవంత్ పై హరీశ్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : రక్షకుడే భక్షకుడు అయ్యారు అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బడగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలే గద్దల్లా వారి భూములు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూములను కాపాడితే.. రేవంత్ ప్రభుత్వం వాటిని దోచుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ కేంద్రంగా రూ.7 వేల కోట్ల భూ స్కామ్ జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. నాదర్ గుల్ భూములకు చాలా చరిత్ర ఉందని, ఈ భూములను ప్రభుత్వ భూములుగా మార్చాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు (Chandrababu) పోరాటం చేయగా అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి (YSR) ప్రభుత్వ భూములుగా ప్రకటించారని గుర్తు చేశారు. కానీ, 600 మంది పేద రైతులు బతుకుతున్న 374 ఎకరాల భూమిని ప్రభుత్వం కబ్జా చేస్తోందని హరీశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బౌన్సర్లను, పోలీసులను పెట్టి వాళ్ల భూముల దగ్గరకు వెళ్లకుండ తమను, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: ’చుక్ చుక్ రైలు వస్తోంది.. పక్కకు పక్కకు జరగండి‘.. చింపాజీల ట్రైన్ ఆట వీడియో వైరల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>