ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం

కలం, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ (Khanapur) మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీ (BJP) అభ్యర్థి అంకం మౌనిక (Ankam Mounika) గెలుపొందారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికలో మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఓటింగ్ లో ఏడుగురు కౌన్సిలర్లు ఆమెకు మద్దతు తెలపడంతో ఎన్నికల అధికారులు ఛైర్పర్సన్ గా మౌనికను ప్రకటించారు. వైస్‌ ఛైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహ్మద్‌ సోయబ్‌ ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ పీఠాన్ని గెలుచుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగిన ఈ ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Read Also:  విజయ్ దేవరకొండతో ఫస్ట్ కిస్.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>