epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కవిత.. గౌరవాన్ని కాపాడుకో: నిరంజన్

తెలంగాణ జాగృతి కవితపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురు కాబట్టే గౌరవం ఇస్తున్నామని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కవితను హెచ్చరించారు. వీరిద్దరి మధ్య కొన్నిరోజులగా మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ‘‘ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు’ అంటూ కవిత(Kavitha) చేసిన వ్యాఖ్యలకు నిరంజన్ కౌంటర్ ఇచ్చారు. తాను నీళ్ల నిరంజన్ అని పిలిపించుకోలేదని, మీరే లిక్కర్ రాణి అని పిలిపించుకున్నారని అన్నారు.

‘‘నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు, నువ్వు ఆడక పోతే బతుకమ్మే లేనట్టు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావు’’ అని విమర్శించారు. ఓట్ల కోసం తండాల్లో తిరుగుతుంటే, మీ కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే ఏం కాదు కానీ మేము సారా కాస్తే అరెస్టు చేయిస్తారా అని నన్ను లంబాడా మహిళలు నిలదీశారని అన్నారు. మేము కేసీఆర్‌కి మంచి పేరు తెస్తుంటే, నువ్వు ఆయనను మానసికంగా వేధిస్తున్నావని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎవరిని సంతోషపెట్టడానికి కవిత తనపై ఆరోపణలు చేస్తోందని నిలదీశారు. మీ అహంకారం, మీ చర్యలు కేసీఆర్(KCR) ఓటమికి ప్రధాన కారణమయ్యాయని ఆరోపించారు. తనకు ఒక్క వ్యవసాయ క్షేత్రం మాత్రమే ఉంది, నీకు గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదా? అన్ని పైసలు నీకు ఎక్కడివి? అని ప్రశ్నించారు. తండ్రి వయసు ఉన్న ఎమ్మెల్యే లను ఇంటికి పిలిపించుకుని, జాగృతి(Jagruthi)లో చేరాలని అడిగి, ఒప్పుకోని తన లాంటి వాళ్ల మీద కవిత ఆరోపణలు వేస్తున్నారని Niranjan Reddy అన్నారు.

Read Also: కాపలాదారే కన్నం వేయబోయాడు.. జూబ్లీహిల్స్‌లో కలకలం..

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>