కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పై BRS సమరభేరి

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నందున కాంగ్రెస్ పై పోరుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గం (Dharmapuri Politics) ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్యమ ప్రణాళికను ఖరారు చేయడం, పక్కా వ్యూహాత్మక అడుగులతో కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో క్షేత్రస్థాయి నిరసనలకు సమాయత్తం కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

ఈ మేరకు కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ ఉద్యమ ప్రణాళికను ఖరారు చేశారు.భాతర రాష్ట్ర సమితి సెప్టెంబర్ 2 నుంచి 8 రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమాలపై వివరించారు. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, మహిళలకు నిరుద్యోగ భృతి వంటి నెరవేరని వాగ్దానాలపై నిలదీయాలని కోరారు. ధర్మపురి నియోజకవర్గంలో నిలిచిపోయిన మౌలిక వసతులు మరియు ఉపాధి రహిత సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటం చేయాలని ఆయన అన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రతి ఇంట్లోనూ గ్రామంలోనూ ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.

​రాబోయే రోజుల్లో ఈ నిరసన ఉద్యమం ధర్మపురి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతటి ప్రభావం చూపుతుందో చూడాలన్నారు. ​కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలోనూ ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వాన్ని నిలదీసేలా ముమ్మర కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుల నాయకత్వంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ​ఈ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>