కలం, నల్లగొండ బ్యూరో: గ్రామపంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అదృష్టం లాటరీ రూపంలో దక్కడంతో ఓ అభ్యర్థిని సర్పంచ్ పదవి వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు సమానంగా 148 ఓట్లు వచ్చాయి. దీంతో సర్పంచ్ అభ్యర్థిని తేల్చేందుకు అధికారులు డ్రా తీశారు. ఈ డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మోర సంధ్య 2 ఓట్లతో పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) విజయం సాధించింది.
- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం తూర్పుతండాలో బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా వీరన్న ఒక్క ఓటుతో విజయం సాధించారు. అయితే పోలింగ్ ప్రక్రియ చివరి నిమిషంలో అభ్యర్థి భూక్య వీరన్న ఓటు వేసుకోవడం గమనార్హం. ఆ ఓటుతోనే విజయం దక్కడం కొసమెరుపు.
Read Also: త్వరలో వర్శిటీల టీచింగ్ పోస్టుల భర్తీ
Follow Us On: Youtube


