epaper
Tuesday, November 18, 2025
epaper

మొదలైన పోలింగ్.. ఓటు వేసిన సునీత..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll) పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను స్టార్ట్ చేశారు అధికారులు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ షురూ అయింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha).. ఉదయాన్నే తన ఓటును వేశారు. ఎల్లారెడ్డి గూడా శ్రీకృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెం.290లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది.

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత(Maganti Sunitha) బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరుపున నవీన్ యాదవ్, బీజేపీ తరుపు లంకల దీపక్ సహా మొత్తం 58 మంది అభ్యర్థులు ఈ ఉపఎన్నిక పోరులో తలపడుతున్నారు. ఈ ఉపఎన్నికను ప్రధాన పార్టీలు మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Read Also: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. అమిత్ షా రియాక్షన్ ఇదే..

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>