కలం వెబ్ డెస్క్ : శాసన మండలి(Legislative Council) శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్(BRS) ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి ప్రకటించారు. రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారని, దీనిపై చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్‌కు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో మండలి సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అటు అసెంబ్లీ(Assembly)లోనూ యూరియా కొరతపై, సోయా రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.
దీన్ని స్పీకర్ తిరస్కరించడంతో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శనివారం హౌజ్‌లోనే ప్లకార్డులతో నిరసన తెలిపారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు అన్యాయం జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే స్పందించి కౌన్సిల్ వేదికగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ కారణంతోనే సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తెలిపారు.
Read Also: నాకు పోలీసు భద్రత కల్పించండి.. మావోయిస్టు లేఖతో కాంగ్రెస్ నేత రిక్వెస్ట్
Follow Us On : WhatsApp


