Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రంలో సమస్యలు తిష్ట… మంత్రుల కేరళం బాట..

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సమస్యలు తిష్ట వేసినా మంత్రులు (Telangana Ministers) మాత్రం కేరళం అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతోనే అక్కడి ఎన్నికల క్యాంపెయిన్ కోసం క్యూ కట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు కేరళంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోయారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. గత మూడు రోజుల పాటు కేరళం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న మంత్రి సీతక్క ఒక రోజు ముందే ఇక్కడకు రిటన్ అయ్యారు. ఈ నెల 9న అక్కడి ఎన్నికల పోలింగ్ జరగనుండడంతో క్యాంపెయిన్ ఈ నెల 7న ముగియనున్నది. అప్పటివరకూ పలువురు రాష్ట్ర మంత్రుల మకాం అక్కడే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం వెళ్లిపోయారు. గురువారం రాత్రికి తిరిగి నగరానికి చేరుకుంటారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాలుగు రోజులుగా అక్కడే ఉన్నారు. ఈ నెల 7వ తేదీన ప్రచారం ముగిసేంతవరకూ అక్కడే ఉండి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుదుచ్చేరి ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్నారు. రెండు రోజుల టూర్ కోసం మంత్రి ఉత్తమ్ ఇప్పటికే కేరళం చేరుకున్నారు. ఒక రోజు అక్కడి ప్రచారంలో పాల్గొని గురువారం తమిళనాడులో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ సమస్యలతో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉంటే మంత్రి మాత్రం ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేరళం ఎన్నికల ప్రచారం ఈ నెల 7న ముగియనున్నా తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఈ నెల 29న జరగనుండడంతో అక్కడి ప్రచారానికి రాష్ట్రం నుంచి పలువురు మంత్రులు (Telangana Ministers) వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల చివరి వరకూ రాష్ట్ర మంత్రులు ఆ పనుల్లో బిజీగా గడిపే అవకాశమున్నది.

Read Also: సీఎం ఇంటి సమీపంలో జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>