శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్ర‌యం (Shamshabad Airport)లో ఓ విమానానికి బాంబు బెదిరింపు(Bomb Threat) రావ‌డం క‌ల‌క‌లం రేపింది. గురువారం తెల్ల‌వారుజామున గ‌ల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానంలో బాంబు పెట్టామంటూ దుండ‌గుడు ఈమెయిల్ ద్వారా బెదిరింపుల‌కు గురి చేశాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు సిబ్బందితో క‌లిసి ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. బాంబు కానీ, ఎలాంటి అనుమానిత వ‌స్తువులు కానీ విమానంలో లేక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈమెయిల్‌పై ఎయిర్‌పోర్ట్ పోలీసులు, అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాంబు బెదిరింపు స‌మాచారం రావడంతో ఎయిర్ పోర్ట్‌లో నెల‌కొన్న హ‌డావుడికి ప్ర‌యాణికులు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ఇటీవ‌ల కాలంలో ఎయిర్‌పోర్ట్‌లు, పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు బాంబు బెదిరింపులు రావ‌డం సాధార‌ణ‌మైపోయింది. ఈ బెదిరింపు వెనుక ఉన్న‌వారిని గుర్తించి అధికారులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌యాణికులు కోరుతున్నారు.

Read Also: బీఆర్ఎస్‌కే మెజార్టీ మున్సిపాలిటీ స్థానాలు: కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>