కలం, వెబ్ డెస్క్ : బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) బాధ్యతలు చేపట్టారు. ఎగువసభ అయిన ‘యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్’ (House of Lords ) లో లైఫ్ పీర్ (Life Peer) గా ఆయన భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఎగువ సభలో చారిత్రాత్మక గదిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను ప్రతినిధులు అధికారికంగా పరిచయం చేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అతిపిన్న వయస్సు ఉన్న వ్యక్తిగా నాగరాజు రికార్డు సృష్టించారు. పాలన, విద్య, సామాజిక ఆవిష్కరణలు సహా ప్రజా జీవితంలో విశిష్టే సేవలు, నాయకత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు లైఫ్ పీరేజ్ ను ప్రదానం చేస్తారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సలహా మేరకు కింగ్ చార్లెస్ – 3, నాగరాజుకు బాధ్యతలు అప్పగించారు.
కాగా, సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శనిగరానికి చెందిన నాగరాజు (Uday Nagaraju) 25 సంవత్సరాల క్రితం బ్రిటన్ కు వెళ్లిపోయారు. ఆయన తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మాలాదేవి. నాగరాజు వరంగల్, హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేశారు. మహారాష్ట్రలోని కిట్స్ లో ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ఆక్స్ ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీలో ఐటీ చేశారు. గాంధేయవాదాన్ని పెంపొందిస్తూ, ఏఐ, గ్లోబల్ గవర్నెన్స్ పై కృషి చేస్తున్నారు.
Read Also: రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయండి.. స్పీకర్‌కు ఎంపీ నిషికాంత్ నోటీసులు
Follow Us On: Sharechat


