జేఎన్‌టీయూలో బాంబు కలకలం: పోలీసుల హై అలర్ట్

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూ (JNTU)కి బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌కు గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈ-మెయిల్ ద్వారా ఈ ముప్పు పొంచి ఉందని తెలియడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు క్యాంపస్‌కు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి.

విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు గురికావడంతో పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం క్యాంపస్‌లో భద్రతను ఏర్పాటు చేశారు.

Read Also: పెళ్లి కోసం టవరెక్కిన యువతి.. 9 గంటల పాటు రచ్చ.. చివరికి ఏమైందంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>