ఆఫ్రికా(Africa)లోని మొజాంబిక్(Mozambique)లో భారీ బోటు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బోటు ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ బోటులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో 14 మంది భారతీయులు ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు ప్రయాణికులు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం బైరా పోర్ట్ సమీపంలో జరగగా వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పలువురు భారతీయులను రక్షించాయి. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో భారతీయులు ఎవరైనా ఉన్నారా అన్న అంశంపై భారత అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా అసలు బోటు బోల్తా పడటానికి కారణాలు ఏంటి అన్న అంశంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

