తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్(Liquor Shop Licence) కోసం దరఖాస్తు చేసుకోవడానికి శనివారమే ఆఖరు తేదీ. ఈ నేపథ్యంలో వీలైనన్ని దరఖాస్తులను స్వీకరించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. శుక్రవారం ఒక్కరోజే 25వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే దరఖాస్తు చేసుకోవడానికి శనివారం ఆఖరి రోజు కావడంతో అబ్కారీ శాఖ అధికారులు మెసేజ్‌లు పెడుతుండటం ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ మెసేజ్‌లలో దరఖాస్తు ఎలా చేసుకోవాలని వివరంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 50వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది మద్యం దుకాణాల లైసెన్స్‌లకు(Liquor Shop Licence) వచ్చిన దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతేడాది దాదాపు 1.20 లక్షల దరఖాస్తులు రాగా ఈ సారి సుమారు 50 వేలే వచ్చాయి. శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ముగియనుండటంతో మహా అయితే మరో 5వేల దరఖాస్తులు రావొచ్చని అధికారులు అంటున్నారు.

